అంతర్జాతీయ శాంతి దినోత్సవం....:-మొహమ్మద్. అఫ్సర వలీషా -ద్వారపూడి( తూ గో జి )
బాలలూ మీకు తెలుసా...
ఈ రోజు అంతర్జాతీయ శాంతి దినోత్సవం 

ఐక్య రాజ్య సమితి దేశాలన్నీ
 ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21
 తేదీన జరుపుకుంటాయి...

అంతర్జాతీయంగా కాల్పుల
 విరమణ, అహింస, శాంతి,
 సోదరభావాల సాధన కోసం
 ఈ దినోత్సవాన్ని 
 జరుపుతున్నారు... 

ఎటువంటి అల్లర్లు, ఘర్షన్లు
 లేకుండా శాంతియుత
 జీవనానికే ప్రజానీకం
 మొగ్గుచూపాలని..... 

శాంతి కపోతాలు ఎగరవేసి
 శాంతిపట్ల తమకు గల
 విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు....

ప్రపంచ శాంతికోసం
 అంతర్జాతీయ స్థాయిలో
 అనేక సమావేశాలు
 జరుపుతున్నారు...

వ్యక్తులు, సంస్థలు, దేశాలు
 ప్రపంచశాంతికోసం
 తమవంతు ప్రయత్నాలు,
 ఆచరణీయ కార్యక్రమాలు
 చేపట్టడానికి ఉద్దేశించిన రోజిది.... 

మనం శాంతిగా ఉందాం
సమాజం  దేశం
సుఖ శాంతులతో ఉండాలని
 కోరుకుందాం
సర్వే జన సుఖినో భవతి...