షాడోలు (క్రీనీడలు ) జీవ వైవిధ్యం :---ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
వనములు శుభములు 
ఊపిరి వరములు 
 వివిధపు మృగములు 
పర్యావరణము రక్ష ఉమా!

పులులూ జింకలు 
సింహం ఉడుతలు 
ఏనుగు ఎలుకలు 
వైవిధ్యంగా మెలుగు ఉమా!

ఫల వృక్షాలను 
తీగ జాతులును 
అడవి గడ్డియును 
అంతాపచ్చగ వనము ఉమా!

పుట్ట గొడుగులూ 
చిట్టి పురుగులూ 
వాన పాములూ 
సకలం కలిసే మెలుగు ఉమా!

ఒకటికి ఒకటిగ
ఆధారాలుగ
వృద్ధి చెందునుగ 
అడవిని ఉండే వింత ఉమా!

ఔషధ వనరులు 
శిఖరపు జలములు 
ఫల సాయమ్ములు 
అడవి తల్లి మనకిచ్చు ఉమా!

తేనె పట్టదిగొ 
పాము పుట్టిదిగొ 
పుట్ట మట్టిదిగొ 
అడుగడుగున ఓ వింత ఉమా!

కాకులు దూరని 
చీమలు పాకని 
వెలుగే సోకని 
కీకారణ్యము లుండు ఉమా!

గిరిజన గూడెము 
చెంచుల వాసము 
సవరల గేహము 
గిరిపుత్రులకే తల్లి ఉమా!

జల పాతములే 
హిమము యేరులే 
నీటి చెలిమలే 
సర్వం ప్రకృతి వరమే ఉమా!

ఇట్టి అడవులను 
కొట్టి వేయగను 
గట్టి హానియును 
మానవులకేను కలుగునుమా!

చేయుము ప్రతినలు 
వేయుము విత్తులు 
పెంచుము వనములు 
రాబోవు తరములకును ఉమా!

ఋతు పవనమ్ములు 
గడ్డి వనమ్ములు 
సకాల వానలు 
అన్నిటి కారణమివే ఉమా!