అర్హత. (.చిన్న కథ.)..--అచ్యుతుని రాజ్యశ్రీ హైదరాబాదు

 మనంఏదైనా ఒకపని చేయాలి అనుకుంటాం. అది మనకు సాధ్యమైంది నలుగురికీ ఉపయోగం గా ఉండాలి. ఇంకొకరిని  చూసి అనుకరిస్తే అవమానాల పాలవుతాము.మన అర్హత శక్తి యుక్తులను బట్టి రాణిస్తాము. ఒకరైతు ఒక  కుక్కని గాడిదను పెంచుతున్నాడు.కుక్క  ఇల్లు అంతాతిరిగేది.దాన్ని  దగ్గరకు తీసుకుని ఒళ్లంతా నిమురుతూ ఆడేవాడు.తనతోపాటు తీసుకుని వెళ్ళేవాడు.  గాడిద పిల్లను బైట చెట్టుకి కట్టి వేసి తిండి నీరు పెట్టేవాడు.  వారానికోసారి సంతకు తీసుకుని వెళ్ళేవాడు. దాని పై ధాన్యపు మూటలు వేసి  తిరిగి వచ్చేటప్పుడు  కావాలసిన సరుకులు తెచ్చుకొనేవాడు.ఇంటికిరాగానే కుక్కతో కాలక్షేపం చేసేవాడు.
అతను కుర్చీలో కూచుంటే  కుక్క  అతని ఒళ్ళో తలపెట్టి పడుకొనేది.తన ముందు కాళ్ళు ఎత్తి  ఆడేది.రైతు కూడా తమాషాలు చేయించేవాడు.  ఇదంతా చూస్తుంటే గాడిదకి కడుపు మండిపోతోంది. అసూయ కూడా కలిగింది. "నాచేత  బండచాకిరీ చేయిస్తూ  ఇంటిలోకి రానీకుండా కట్టేస్తాడు.కుక్కని ముద్దు చేస్తాడా.?నేనూ ఇంటి లో కెళ్ళి అతని ఒళ్ళో తలపెట్టి పడుకొని ఆడుతా"అనుకుంటూ  తాడు తెంపుకుని గదిలోకి వచ్చి  సరాసరి రైతు ఒళ్ళో  తలపెట్టి పడుకుంది. రైతు భయంతో కేకలు వేయసాగాడు.పనివాడుపరుగున వచ్చి  కర్రతో  గాడిదను తరిమాడు.కానీ ఆది మళ్లీ రైతు దగ్గరకు రాగానే  అతను కూడా  దాన్ని  బాదాడు.రైతు  పనివాడు దానికి పిచ్చి ఎక్కిన దని భావించారు. ఊరి పొలిమేర దాకా తరిమారు.అనవసరంగా దెబ్బలు తిని  ఉన్న  ఆశ్రయంని పోగొట్టుకున్న గాడిద  లబోదిబో అని ఏడ్చింది. మన అర్హత  అదృష్టం కృషి వల్లనే మనం పదవులు  డబ్బు  గౌరవ మర్యాదలు పొందుతున్నాము.అసూయ  ఈర్ష్యతో నవ్వులపాలు అవుతాము సుమా!
..