*ప్రస్తుతం!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 1.అంతఃకలహాలు పక్కనపెట్టు,
   కరోనాకలహాంతం దారిపట్టు,
  మనిషి పిడికిలి శక్తికడలి,
 పిడికెళ్ళకూరిమి మహాబలిమి,
 దెబ్బకి,ఆ మహామారి పరారి!
2.ఎన్నికల్లో ఎవరు గెలిచినా,
    మానిఫెస్టోల్లో ఎన్ని చెప్పినా,
ముందు,ముట్టడి కట్టడి చేసి,
 *నరబలి* అడ్డుకట్ట వేయాలి,
కర్ఫ్యూ, లాక్ డౌన్, వైద్యం,
జాగ్రత్తలు--- మనం గెలవాలి!
ఆనాడే సంబరాలు జరపాలి!
3.ఎలుకపడని బోనులెందుకు!
 విధానాలు కాదు, సమాధానం!
 ఆరోపణలు, ప్రత్యారోపణలా!
ఆచరణతో పరిష్కారం కావాలి!
4.నేనా! నీవా! కాదు,
   మనం అన్న భావన *ఘనం*
   ఏ ఉపద్రవం వచ్చినా,
   ఐకమత్యపోరాటమే శరణం!
బానిసత్వవిముక్తిరహస్యమదే!
5.ఓ మహాసురసంహార,
సమరాన వానరులే వారధి
కట్టీ, 
విజయానికి బాటవేసారే!
 మనం నరులం! ప్రజ్ఞానిధులం!
నేడు, కరోనాసంహారఉద్యమం!
ప్రతి నరుడు వీరభద్రుడే!
 ప్రతి నారి  రణభద్రకాళే!
జయభేరి దిక్కులన్నిటామోగగ,
విజయగీతి విశ్వమంతా, వినిపిస్తుంది,
*విజయీభవ!*