*మేలుకో*:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 చిన్నారి నాతండ్రి
మేలుకోరా
తెల్లవారిందీ కోడికూసిందీ
బాలభానుడు పైకి
లేచి వచ్చాడూ
పక్షులన్నీ వాటి
గూళ్ళు విడిచాయీ
పశువులన్నీ కూడ
మేతకెళ్ళాయీ
నీ తోటి నేస్తాలు
ఆడ వచ్చారూ
నీ తోటి వారంత
పాడ వచ్చారూ
చిట్టితండ్రీ నీవు
మేలుకోరా !!