గుబ్బ కాయలు -బాల గేయం :--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
సీమ చింత గుబ్బలోయ్ 
రంగు రంగు తీపిలోయ్ 
దోటి పట్టి తీరుతారు 
ఎండల్లో పిల్లలోయ్ !

చెట్టు చూస్తే ఏమంతా 
అందంగా ఉండదోయ్ 
కొమ్మల్లో సీమ చింత 
తొంగి చూసి నవ్వురోయ్ !

వగరు పొగరు కాయలన్ని 
వాటంగా కోయురోయ్ 
కుప్పలుగా పంచుకున్న 
సీమ చింత గొప్పదోయ్ !

బుట్ట నిండా కాయలేసి 
బడి కాడ అమ్మురోయ్ 
వచ్చింది వచ్చినట్టే 
సాయంత్రం సిన్మా కోయ్ !

నల్ల వైన గింజలన్నీ 
సూది దారం గుచ్చవోయ్ 
పూసలతో దండలంటు 
వేసుకోని తిరిగే రోయ్ !