జాలరి -బాల గేయం (మెరుపులు):--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

 సముద్రంలో చేపలవేట 
సాహసవీరుడు జాలరి 
తుఫానులెన్నో దాటేనంట 
బ్రతుకుతెరువుకే కదామరి!
(416)
సూరీడుకంటే ముందేలేచి 
వలలూపడవ సరిజేస్తారు 
వారంరోజుల తిండిసంచి 
తీసుకొని వేటకుపోతారు!
(417)
నడిసంద్రంలో ఎన్నోవింతలు 
పడవనుకొట్టే తిమింగలాలోయ్ 
భయమేలేక తరిమేదోస్తులు 
జాగ్రత్తగానే ఉండాలోయ్ !
(418)
ఆటూపోటుల నడుమసాగే 
పడవప్రయాణం అలవాటు 
అనుకోకుండా తుఫానులాగే 
వర్షంవస్తే గ్రహపాటు !
(419)
లైటుహవుస్ కనిపిస్తుంది 
దారితప్పిన సమయంలో 
బ్రతుకుజీవుడా అనిపిస్తుంది 
తీరంచేరే సంతోషంలో !
(420)