ఇంటికి అరుగు
ఇంతికి మరుగు
అందాలోయ్
అందాలు
-----
మాటకు ఋజువు
కోటకు బురుజు
వుండాలోయ్
వుండాలి
------
ఊరికి రోడ్డు
పెళ్ళికి కార్డు
వెయ్యాలోయ్
వెయ్యాలి
------
బిడ్డకు గ్రుడ్డూ
గొడ్డుకు మడ్డి
పెట్టాలోయ్
పెట్టాలి
-------
కాలికి చెప్పు
పప్పుకు వుప్పు
వేయాలోయ్
వేయాలి
-----+
మనసుకి మమత
మనువుకు సమత
వుండాలోయ్
వుండాలి
---------
పాపకి ముద్దు
నోటికి సుద్దు
వుండాలోయ్
వుండాలి
--------
చీటికి వ్రాలు
చేతికి దానం
వుండాలోయ్
వుండాలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి