*కొల మానం*(మినీకవిత):-డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి--అనకాపల్లి

ధర్మామీటర్
నిక్కచ్చిగా వేడి లెక్కించి
తన ధర్మాన్ని నెరవేరుస్తుంది!

లాక్టో మీటర్,
స్వచ్ఛతను ఋజువుచేసి,
మంచి లక్షణం చెపుతుంది!

ఏ మీటరూ కొలవదేం...
మనిషిలో వెలితిని...
మనసుల కొలతని..!!
          ***