వెండితెర(వచనకవిత)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

 వినోదమే ప్రధానంగా సామాన్యప్రజల ఆనందసాధనం
కథ-కథనం,నటన-ఆహార్యం
సంగీతం-సాహిత్యం,విలువలు-క్రమశిక్షణ నాటి సినిమాలు
సందేశాలతో,సాంఘికసమస్యల పరిష్కారాలతో,ఎన్ని‌దశాబ్దాలు గడిచినా అపురూపమై నిలిచిపోయాయి.
వ్యాపారధోరణి,కామం,హింస,
వింతపోకడలతో,అసభ్యకరధోరణులతో సాగిపోతుంది నేటి సినిమా
బయ్యర్లు,డిస్ట్రిబ్యూటర్లు లాభాలవేటలో అనారోగ్య కరమైన పోటీలో కొట్టుకుపోతున్నారు
సందేశాలు తక్కువై,శాడిజాలు ఎక్కువై నడుస్తున్నాయి నేటి సినిమాలు
విలువల వలువలు ఒక్కొక్కటే ఊడిపోతుంటే థియేటర్ల వసూళ్ళు రికార్డులు స్థాపిస్తున్నాయి
సగటు ప్రేక్షకుడి జేబులను‌ యధేచ్ఛగా దోచేస్తున్నాయి
ఎడారిలో ఒయాసిస్సులా కొన్నిమంచి సినిమాలొచ్చినా
సినిమాహాళ్ళు కరవు,ప్రేక్షకులు కరవు
గతకాలమే మేలని నిట్టూర్చడం తప్ప చేసేదేమి లేదన్నది నిజం