సీతాకోక చిలక -బాల గేయం :--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

చుక్కల చీరగట్టి సీతాకోకా 
నువ్వు 
చక్కగ తోటకొచ్చి నావేపూలా 
కొరకు

మక్కువ పూలమీద వాలేదాకా 
నువ్వు 
రెక్కలు ఆడిస్తవు రాణీచిలకా 
భలే 

తీయని తేనెలేవొ తాగీనావా 
నువ్వు 
సైయని తోటలోన సాగీనావా 
ఇలా 

అల్లరి పిల్లలేమొ పట్టూకోరా 
నిన్ను 
చల్లగ పారిపోయి రావేసీతా 
కోక!!