బాల రామాయణం (మణి పూసలు):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
సద్గుణములు నున్న వాడు
చక్కని గుణముల రాముడు
జేష్ఠ పుత్రున్ని జూసి
కన్నతండ్రి మురిసి నాడు

దశరథుడు నచ్చటి కొచ్చి
ధర్మ పద్ధతులను మెచ్చి
రాముని గూర్చి నతడు
కైకేయికి జెప్ప వచ్చె

కనులలో నీరు గమ్మగ
కైకేయికేమొ తెలుపగ
చెప్పిన మాటలు విని
ముచ్చటించేనుముద్దుగ

రాజువొడిన జేరి కైక
మోజుతోడ నడిగె కైక
ముందు కోరిన కోర్కెలు
ఇవ్వు మనియు నడిగె కైక

జేష్టుండు అయోద్యనొదలి
అడవికి వెళ్ళి పోవాలి
అని కోరినాది కైక
 కోరిక మీరు తీర్చాలి