సమాహారకళ(అక్షరమాలికలు)-డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

 ఏకపది:
*******
1.మనసులోని భావాన్ని మొహంలో.....
ప్రస్ఫుటంగా పలికిస్తుంది!!
2.హావభావాలు, ఆంగికం వాచికాలతో కలిపి....
పరిపూర్ణమవుతుంది!!
ద్విపది:
*******
1.అందంతో పాటు రాణిస్తుంది.
కానీ భావావేశాలు పలకపోతే...
అభినయం‌ వ్యర్థమవుతుంది.
2.రసాలను పలికిస్తేనే రసవంతమవుతుంది.
కళ్ళతోనే జీవం పోసి...
అభినయకళను‌ బ్రతికించాలి.
త్రిపది:
******
1.అందం,అభినయం పరస్పరాశ్రితాలు.
సమయస్ఫూర్తి నటన రాణింపునిస్తుంది.
సహజంగా నటించి,జీవించడమే ప్రేక్షకుల మనసుల్లో నిలుస్తుంది.
2.అనుభూతి చెందించడమే అభినయం.
లీనం చేసి ఆనందం కలిగిస్తుంది.
హృదయాన్ని తాకి జ్ఞాపకమవుతుంది.