*చేసేస్తాం*:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 బాలబాలికలం మేము
భావి పౌరులం మేము
నచ్చని పనులు మేము చేయము
ఇష్టమైనవే చేసేస్తాం!!బాల!!
కోపము శాపము మాకునచ్చవు
అల్లరిపనులే మాకిష్టం
బలవంతాలు మాకునచ్చవు
ఆటా పాటా మాకిష్టం!!బాల!!
బడితెపూజలు మాకునచ్చవు
కథలూ నవ్వులు మాకిష్టం
తొడపాశాలూ మాకునచ్చవు
మెదడుకు పదును మాకిష్టం!! బాల!!
నాల్గుగోడలూ మాకునచ్చవు
ఆరుబయటనే మాకిష్టం
మారణహోమం మాకునచ్చదు
సత్యాహింసలు మాకిష్టం!!బాల!!
దౌర్జన్యం కాఠిన్యం మాకునచ్చదు
దయా జాలీ మాకిష్టం
అన్యాయాలూ ఆవేదనలూ మాకునచ్చవు
ప్రేమానురాగాలే మాకిష్టం!!బాల!!