ఎందుకో ..అలా ..!!:-డా.కె.ఎల్.వి.ప్రసాద్,-హన్మకొండ .
ఎందుకో నామనసంతా 
ఎలాగో అయిపొయింది ,
నీజ్ఞాపకాలు సుడులుతిరిగి 
మెదడుమొద్దుబారిపోయింది !       //ఎందుకో //

ప్రేమంటేఏమిటో .....
ప్రేమించి చూపించావు ,
నీప్రేమను నాలో --
నరనరాన చొప్పించావు ,
నామదిలో నీప్రేమమందిరం ,
నిర్మించుకుని ...
దేవతలా ..కొలుచుకునేలోపు ,
కనుమరుగైపోయావు నువ్వు ,
నాహృదయంలో -
నీ చిరునామా ...
చెరిపేసిపోయావు నువ్వు !            //ఎందుకో //

నేనేదో అన్నానని .....
ఏవేవో వూహించుకున్నావు ,
ఎందుకో కలవరపడ్డావు
నిన్ను నీవు హింసించుకుని ...
నాకు వ్యధను మిగిల్చావు,
నీ  సుఖమే నేను కోరుతున్నానని
తెలుసుకోలేక తొందర పడ్డావు      //ఎందుకో //

మనిషిగా ఇలలో నువ్వు లేకున్నా ,
నాకలల అలలలో నువ్వు
కదులుతూ-మెదులుతూ
కనిపిస్తూనే ఉంటావు ....
గతాన్ని గుర్తుచేస్తూ ....
నామదిలో ....
సుమధుర కుసుమం లా ,
వికసిస్తూనే ఉంటావు .....
నీప్రేమ సుగంధాన్ని ....
వెదజల్లుతూనే ఉంటావు ....!
నిన్ను ..నీవు నాకు ..నిత్యం ,
గుర్తుచేస్తూనే ఉంటావు ....!!       //ఎందుకో //