అచ్చుల ఆట (బాలగేయం)పెందోట వెంకటేశ్వర్లు
అడివి కి పోదాం వస్తారా
 ఆడే నెమల్లు అయితారా
ఇసుకను గొప్పగా చేద్దామా
 ఈలలు వేస్తూ ఎగురెదమా

ఉడుత పరుగులు చూస్తూనే
ఊడలు పట్టి ఊగెదమా
ఎండుటాకుల సప్పుడులు 
ఏటిలోన దూకుడులు


 ఐకమత్యమే మహాబలం 
 అందరం ఒకటే  అని తెలిపీ
 ఆనందముగా నుండెదమా
అచ్చుల పాటను పాడుదమా