ఆక్సిజన్:-సముద్రాల శ్రీదేవి

 బ్రతుకు పేజీలు  తిప్పుతున్న ప్పుడు అపశృతిలా ఆగిపోతూ
వణుకుతున్న  మాయరోగం.
మధ్యలోనే తెగుతున్న ఆనందపు
 తీగలు.
నిన్నటి వరకు ఎగురుతున్న
ఆశల గాలిపటం 
ఏ గాలివాటు కొమ్మకు చిక్కుకుందో
మెల్లిగా  తనను తాను చిక్కు ముళ్ళను.   విప్పుకుంటున్న  ప్రయత్నం.
నిన్నటి మధుర
క్షణాలు ఇంకా కళ్ళ ముందు
 కదలాడుతూనే ఉన్నాయి.
చుట్టూరా సహాయక చర్యలు
 పేజీలు చిరగనీకుండా అడ్డు చేతుల రక్షణ కవచాలై 
.రెప రెప లాడుతున్న మిగిలిన పేజీలను
మళ్ళీ తిరగెయ్యాలని 
ప్రయత్నిస్తూనే ఉన్నాయి.
జీవచ్చవమైన కళ్ళల్లో ప్రాణం
దాచుకుంటుంది..
కళ్ళు ఊపిరితో చివరిసారి మాట్లాడుతున్నాయి.ఆపకుండా
నీ ఊపిరి 
తో నైనా బతుకు పేజీలు
తిప్పమని.
అలుముకుంటున్న.   గాలిని 
తోడుతీసుకుని అల్లుకుంటూ
 చెదలుపట్టిన రోగపు
పేజీలను  ఊపిరి మెల్లిగా తిప్పుతుంది
 మౌనంగా   ఆశ శ్వాసించడం
మొదలుపెట్టింది