అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి :-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

పిలుపుతో పలుకుతూ పిఠాపుర సమీపము 
ఇనుగంటి బహద్దరు, ఈరంకి ప్రకాశము 

అనువారి కలలోన ఆ సత్య దేవుడిదె 
కనిపించి నుడివెనూ కటాక్షము చూపించి

"రత్నగిరి పైనేను రయముగా వెలయుదును 
ప్రతిష్టించియు మీరు ప్రస్థుతించుడు నన్ను "

మరునాడు యిద్దరూ మహిమనే జూడంగ 
అన్నవరమును జేరి యన్వేషణము జేయ 

అంకుడు చెట్టు కింద ఆ స్వామి పాదములు 
సూర్య కిరణము పడియు సూటిగా మెరిసినవి 

విగ్రహము తొలగించి విష్ణు పంచాయతన 
సహితముగ ప్రతిష్టను సరిపూజలను జరిపె 

మూడు గోపురాలను ముఖ్యదేవతలెల్ల 
ఆదిత్య దేవతా అంబికా ప్రతీకలు 

చక్రశిఖరమ్ములును చక్కగా నున్నవిట
ఘననిత్య పూజలు ఘనముగా జరిగేను 

అన్నవర కళ్యాణ మపురూప మెంతయును 
వైశాఖ మాసమున వైశాఖ దశమిలో 

ప్రారంభమగు చుండు ప్రతియేట వైభవము 
బ్రహ్మోత్సవాలనియు బ్రహ్మాండముగ జరుగు 

ప్రతిజంట జేయవలె  ప్రత్యేక వ్రతమునూ 
సత్యనారాయణుని నిత్యమును కొలవాలి 

గృహప్రవేశముకును గృహస్థులు చేయాలి 
శ్రీ సత్య దేవునికి శ్రీనిత్య  హారతులు !!