మాయాచిత్రిణి(వచనకవిత)-డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.

 అందమైన దృశ్యాలను
ఆనందమైన జ్ఞాపకాలను
మరచిపోలేని అనుభూతులను
తిరిగిరాని వ్యక్తులను
ముద్రవేసిన సంఘటనలను
మురిసిన సన్నివేశాలను
జీవిత ముఖ్యఘట్టాలను
సాధించిన విజయాలను
హృదయవిదారక దృశ్యాలను
కనబరచిన సాహసాలను
చేసిన సేవలను
ప్రకృతి పారవశ్యాలను
ప్రకృతి భీభత్సాలను
ఆధ్యాత్మిక, తాత్విక,వేదాంత అద్భుతాలను
జీవితాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించే
కెమెరానే ఇప్పటికీ మేటి.