ప్రేరణ..(చిన్న కథ.)..అచ్యుతుని రాజ్యశ్రీ

 ఒక్కోసారి మనం ఏ పనీ చేయలేము.మనకు రాదు చేతకాదు అని నిరుత్సాహంతో.పని చేయకుండా  కూలబడితే  అది మన ఉన్నతికి ఆటంకం అవుతుంది. అభ్యాసం కూసువిద్య అన్నారు.  బడిలోచేరగానే కొంత మంది చాలా వేగంగా నేర్చుకోవాలి అనే తపన తో కృషి చేస్తారు. ఇంకొందరు  ధ్యాస పెట్టకుండా  నాకు రాదు చేతకాదు అని చతికిలపడతారు.కృషి చేయాలి. మరి అలాంటి ఓకప్పని గురించి  చదువుదాం. అక్కడ పెద్ద పచ్చికబయలు.ఓకుందేలు కప్ప మంచి స్నేహితులు. రోజు  ఎంచక్కా ఆడుకుని పరుగులుతీసేవి.కుందేలు  పరుగు పెడితే  కప్ప గంతులేస్తూ దూకుతూ  పోటీపడేవి. ఒకరోజు  రాత్రి వర్షం పడింది. కానీ తెల్లారి నాక
సూరీడు రావటంతో పచ్చికపై కప్ప కుందేలు ఎంచక్కా  గంతులేస్తున్నాయి.కానీ  హఠాత్తుగా  సన్నగా లోతుగా ఉన్న  గోతిలో కప్ప జర్రున జారి"అన్నా"అని కేకలు పెడుతూంటే కుందేలు కి  అది కనపడదు. పైగా ఆగొయ్యి పై పచ్చిక ఉంది. కుందేలు  ఆశబ్దం వచ్చినచోట గడ్డిపోచలను తొలగించింది.పాపం  కప్ప బెకబెకలతో  పైకి రాలేకకూచుంది."నా ముందు కాలు రంధ్రంలో దూరుస్తా.నేను  పైకి లాగుతా" కుందేలు  అరుస్తుంది. కానీ భయంతో  కప్ప ఎగిరే ప్రయత్నం చేయదు. కుందేలు  అంది"నేను  ఒక తాడు తెచ్చి  గోతిలో జారవిడుస్తా.దాన్ని పట్టుకో.నేను పైకి లాగుతా." అది సన్న  తాడు తెచ్చేసరికి కప్ప పైకి వచ్చి  రొప్పుతోంది."అరె!ఎలా బైటకి వచ్చావు?""అన్నా!ఒక బురద పాము గుంటలోకి జారుతుంటే  దాన్ని  పట్టుకుని  పైకి  గెంతాను.నీవు  పిలిచినా  ఎగిరే శక్తి లేదు అని ప్రయత్నించలేదు. కానీ పాముని చూసి  భయం ఆధారం దొరకటం తో గెంతాను. " మన ప్రయత్నం మనం చేయాలి.  బోర్వెల్ బావుల్లో  పిల్లలు  పడుతుంటే  ఊరివారు సిబ్బంది  ఎంత శ్రమపడుతున్నారో మనం చూస్తున్నాం.  ఆడుకునే ప్రాంతం  బాగా  పరిశీలించాలి.  ఆపదవస్తే మన శక్తి యుక్తులను  ఉపయోగించాలి.