*ఎంచక్కా*:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్

 ఎర్రనిబంతి సూర్యుడు
తెల్లనిబంతి చంద్రుడు
మెరిసేచుక్కలు పువ్వులు
మిన్నుపైనుండేవి ఇవిఆన్నీ
మన్నుపైకొచ్చాయి చూడండి
ఆటాడుకుందాం మనమంతా
పాటలన్ని పాడుకుందాం ఎంచక్కా !!