కప్ప తెలివి....అచ్యుతుని రాజ్యశ్రీ హైదరాబాదు

 మనకు తెలివితో పాటు సమయస్ఫూర్తి కూడా ఉంటే అపాయంనించి ఉపాయంతో బైట పడగలం.ఆపల్లెకి దగ్గర లో ఒక పెద్ద చెరువు దాని నిండా బోలెడన్ని కప్పలు  బెకబెకలతో  సందడిచేసేవి.వాటికి పెద్దదిక్కు ఒకపెద్ద బోదురుకప్ప. దాని ఆకారం స్వరంకూడ చాలా పెద్దవే!వర్షంకి చెరువు నిండితే బెకబెకలతో అరుస్తూ పహరాకాసేది. దాని కంఠందగ్గర గోలీకాయలు ఉబ్బి   అందరికీ  ఆశ్చర్యం కలిగించేది.ఆపల్లె వాసులంతా రోజు బిందెలకొద్దీ  నీరు మోసుకెళ్లేవారు. కప్పలవల్ల చెరువులో దోమలు క్రిమికీటకా లు ఉండేవి కావు. జనం నీటిని మూడు పొరలబట్ట తో వడకట్టి  ఇంటిలోకాచి తాగేవారు.అందుకే వారికి అనారోగ్యం లేదు.   ఒకరోజు ఎక్కడనుంచో ఒక పులిపిల్ల వచ్చింది. దానికి బాగా  దాహంగాఉంది.కప్పకి ఇదినచ్చలేదు.పులి పల్లె లోమేక గొర్రెలుతో పాటు  భవిష్యత్తులో  మనిషి పిల్లలకి  యముడిలా మారవచ్చు.అందుకే దీన్ని తరిమేయాలని ఆలోచించి ఇలాఅంది"పులి బాబూ! నీవు  నీరు తాగేముందు పందెం గెలవాలి. మనం దూకుతూ  నీఅడవి బాట పట్టాలి. ఎవరు ముందు  ఉంటారో వారు చెప్పింది ఇంకోరు వినాలి." సరే అని పులి అనటం ఆలస్యం కప్ప దాని తోకపై గెంతి గట్టిగా పట్టుకుంది. అరకిలోమీటరు  వెళ్లినాక జంప్ చేసిన కప్ప వెనక  ఉంది పులి."మొదటి ఓటమి!నీకు  ఇంకా రెండు అవకాశాలు!"కప్ప అరిచి  దాని తోకపై ఎక్కింది. కిలోమీటర్ వెళ్లగానే పులి ముందు దూరం గా గెంతి "ఇదే ఆఖరు నీకు!"అని కవ్వించింది.అప్పటికే  పులికి నీరసం దప్పిక!కానీ  రోషంతో గెంతటానికి ఒప్పుకుంది. తన ట్రిక్ ఉపయోగించి  కప్ప గెలిచింది. "పులి బాబూ  !మాజోలికి వస్తే  నీవు  ఖతం!" అన్న కప్ప హెచ్చరికతో పులి  బతుకుజీవుడా అని పారిపోయింది.