ఊహలపల్లకి ..!!:-డా .కె .ఎల్.వి.ప్రసాద్,-హన్మకొండ .
వయ్యారం ఒలికిస్తూ ,
చేపకళ్ళు ఎగరేస్తూ ...
చిలిపి నవ్వొకటి విసిరేస్తూ 
ఎక్కడికే నీపయనం చిన్నదానా !
ఎందుకలా చూస్తావే పిల్లదానా !!   //వయ్యారం //

ఒళ్లంతా కళ్లుచేసుకుని ,
మనసు తలుపులు తెరిచికొని 
తరగని వలపుల తలపుల్లో 
వుయ్యాలలూగుతున్న 
గడసరి పిల్లోడా .....
మనసంతా నీకోసం తపించిపోతున్నది 
సొగసరిబుల్లోడా ...!!                 //వయ్యారం //

చిలకపచ్చ చీరతెచ్చానే నీకు 
చిలిపికళ్ల సొగసరి చిన్నదానా ,
సిగనిండా తురుముకోను 
నీకోసంమల్లెదండ తెచ్చానే ,
వన్నెల వయ్యారి -
నా ..వలపులమయూరి !         // వయ్యారం //
బహుమతులెన్ని ఉన్నా ..
నీ ప్రేమముందు బలాదూర్ ,
మనప్రేమ ఎంత మధురమైన 
దరిచేరనివ్వదు 
ఈ  గ్రీష్మ తాపం ....!
అర్థం చేసుకోదు ...
మనలోపలి ..ఈ ,
ప్రణయ జ్వలనం !!              

ఇద్దరూ >అందుకని ....
ఊహల్లోనే ఊరేగుదాం !
కాలం కలిసొచ్చేదాకా ....
కలలతోనే గడిపేద్దాం !           //ఊహల్లోనే //