పిచుకమ్మ(బాల గేయం)

 పిచుకమ్మ పిచుకమ్మ
పిట్ట పిచుకమ్మ
పట్టుకొందామంటె
పారిపోతావు
ముట్టకోవాలనీ మురిపమేనాకు
ఇట్టిట్టె తిరుగుతూ
ఇంటి చూరులలో
గూడును కడతావె
గుట్టుగా నీవు
గూటిలో గ్రుడ్లెట్టి పిల్లలను చేసి
కిచకిచల భాషను చకచకా నేర్పి
బ్రతుకు తెరువును తెల్పి
బయటకొదిలావు
పిచుకమ్మ నీతెలివి బహుదొడ్డదమ్మా
నేర్పవే పిచుకమ్మ నేర్చుకొంటాను
బ్రతుకుతెరువును నేర్చి బాగుపడతాను
గురువుగా నీన్నెపుడు
కొలుచుకొంటాను