చిలుక చీమ నేస్తాలు (బాల గేయం):-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట

గట్టు మీద చింత చెట్టు
చెట్టుమీద చిట్టి చిలక
చెట్టు కింద చిన్న చీమ
చిలుక చీమ నేస్తాలు

వేటగాడు వచ్చాడు
చెట్టు కింద చేరాడు 
నేల మీద ఒరిగాడు
చెట్టు పైకి చూసాడు

బాణం చేత పట్టాడు
చిలుకకు గురిపెట్టాడు
చిన్న చీమ చూసింది
చిటుక్ మని కుట్టింది

అబ్బ అంటూ అరిచాడు
బాణం గురి తప్పింది
చిలుక లేచిపోయింది
నెత్తికి చేతులు పెట్టాడు

దిక్కులు చూస్తూ వెళ్ళాడు
చీమ చూసి నవ్వింది
చిలుక చీమను పిలిచింది
కృతజ్ఞతలు తెలిపింది