పద్యాలు :-బెజగాం శ్రీజ , గుర్రాలగొంది


 1ఆ.వె.
సోనుసూదుగారు చూడచక్కని సేవ
ప్రజల కొఱకు చేసె పట్టుదలగ
ప్రాణ వాయు విచ్చి ప్రాణాలు కాపాడె 
ప్లాంట్లునేర్పరచిన ప్రాణదాత
2ఆ.వె.
భరతభూమినేడు బాధలోయుండగ
సేవజేసెతాను చెంతయుండి
ఆకలైనప్రజల యన్నమునేపెట్టి
కడుపునింపినాడు కొడుకులాగ
3ఆ.వె.
ఈ కరోనవచ్చి నెన్నియో బాధలు
మనకు బెట్టుచుండె మాయ జేసి
కన్నబిడ్డలాగ మిన్నసేవలు జేసి
ప్రజల రియలు హీరొ పరగ జగతి.