జీవిత భాగస్వామికి పుట్టిన రోజు శుభాకాంక్షలు..:-పరిమి వెంకట సత్యమూర్తి-హైదరాబాద్.

 సీత!!  నా జీవితంలో
వెలుగులు నింపిన దేవత
మూడుముళ్ళ బంధంతో
ఈ రామయ్యకు ముద్దుల
అర్థాంగివై
వేలు పట్టి నడిచావు
వెన్నంటి నిలిచావు
సీతారామయ్య అనే ఏకవాక్యంగా మారావు
అర్దనారీశ్వరుణ్ణి చేశావు
ఆణి ముత్యాలాంటి ఇద్దరు
ఆడపిల్లల్ని నాకు కానుకగా ఇచ్చి
నాన్న అనే కమ్మని పిలుపులోని మాధుర్యాన్ని
నాకందించావు!!
నా సంసార నావకు చుక్కానివై
ఆటు పోట్లను చీల్చుకుంటూ
కడలికి చేర్చిన ఓ 
నా సతీమణి
సత్యమూర్తిని చేశావు సాహితీమూర్తిని 
నీ జన్మదినం నాకో పర్వదినం కాగా
పలుకు పలుకులో ప్రణయ
ముప్పొంగగా
పలుకుచుంటిని జన్మదిన శుభాకాంక్షలని!!
అందుకో నా హృదయేశ్వరి
అణువణువున నిండిన ప్రాణేశ్వరి!!
*సీతమ్మ ( డా.చీదెళ్ల* *సీతాలక్ష్మి) కు* *జన్మదిన* *శుభాకాంక్షలు*
    *- నీ రామయ్య*