ప్రావీణ్యత (బాలగేయం):-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట
రాదు నాకు ఏవనీ
కదలకుండ ఉన్నచో 
లేరు ఎవరు నాకనీ
నోరు విప్పకున్నచో 
ఏది రాదు ఎవరికైనా 

కదలి ముందు సాగరా
తెలిసినంత చేయరా 
సిగ్గు భయం వదలరా
అనాథలైన సరే 
వికలాంగులైనా సరె

మనసు నిలిపి పనులు 
సాధనలే చేయుచున్న 
ప్రావీణ్యత పెరుగురా 
విజయాలే కురియుగా
విజేతలైరి ఎందరో.