అంతర్జాలం లో ప్రముఖ నటుడు చంద్రమోహన్ జన్మదిన వేడుక

 ప్రముఖ నటుడు చంద్రమోహన్ జన్మదిన వేడుకల్లో భాగంగా మే 23 ఆదివారం అంతర్జాల వేదికగా గా వంశీ గ్లోబల్ అవార్డ్స్ సంతోషం ఫిలిం న్యూస్ శారద ఆకునూరి సమన్వయంతో నిర్వహించిన కార్యక్రమాన్ని ఏపీ శాసనసభ పూర్వ ఉప సభ మండలి బుద్ధ ప్రసాద్ గారు
మరియు దర్శకుడు రేలంగి నరసింహారావు గారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో
ప్రముఖ రచయిత్రి శ్రీమతి నెల్లుట్ల
 సునీత శ్రీమతి ఒక బహుమతి అనే చలనచిత్రం పై రీసెర్చ్ ఆర్టికల్ రాశి పేపర్ ప్రజెంటేషన్ చేశారు. చంద్రమోహన్ గారి నటన వైదుష్యం పై ప్రసంగించి  పత్ర సమర్పణ చేశారు శ్రీమతి నెల్లుట్ల సునీత ప్రసంగం పత్ర సమర్పణ
తెలుగు బుక్ వరల్డ్ రికార్డులో నమోదు
అవుతుందని సంతోషం సురేష్  తెలిపారు దీనిని గ్రంధరూపంలో తీసుకురాబోతున్నారు అని శిరోమణి శ్రీ వంశీ రామరాజు గారు తెలిపారు.
ఈ అంతర్జాలం వేదిక సమావేశంలో ఐదు ఖండాలు లోని 14 దేశాల తెలుగు వారు ప్రసంగించారు 108 చలనచిత్రాలు 108 రచయిత రచయిత్రుల పాల్గొని ప్రసంగించారు.
ప్రముఖ రచయిత్రి జలంధర్ ప్రముఖ  సినీ నటుడు చంద్రమోహన్ ప్రముఖ నటి జమున గీత రచయిత భువనచంద్ర నటుడు మురళీమోహన్ సింగపూర్  యూ కే అమెరికాలకు చెందినవారు తదితరులు పాల్గొన్నారు. విశ్వ వ్యాప్తంగా ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ప్రసారమైంది. శనివారం భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ప్రారంభించి ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు
 విజయవంతంగా కార్యక్రమం ముగిసింది.
ఈ సందర్భంగా శ్రీమతి నెల్లుట్ల సునీత
ప్రముఖ రచయిత్రులు సినీ నటీనటులు అభినందించారు.