జింక పిల్ల -బాల గేయం (మణిపూసలు):-- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
బంగారు లేడివమ్మ 
అందాల హరిణివమ్మ
వరిచేల లోన నీవు 
పరుగులే తీయకమ్మ !

భయమునే చూపుకనులు 
రయముగాను పాదములు 
ప్రకృతిన  పిలుపులవిగో 
పచ్చికను మేసి కదులు!

ఈ వనము లందుహాయి 
అందాల విందులోయి 
అదెచూడవోయ్ సెలయేరు 
చల్లనివి జలములోయి!

అరె వేటగాడు అడుగో 
పొద చాటు కెళ్లి దాగో 
వెతికేటి లోగ అరుపు 
పులిరాజు కే విసుగో !

మరి ఏనుగమ్మ వచ్చె 
ఇక చెరుకులేమొ తెచ్చె 
సావాస మెంత ఘనము 
వనమంత మిమ్ము మెచ్చె !