ఈత పళ్ళు -బాల గేయం :--- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
తీయతీయని ఈత పళ్ళు 
వేసవిలో దొరికే పళ్ళు 
పల్లెల్లో విరగకాసే
పట్నంలో పైసల దొరికే !

ఈత చెట్టు అందంచూడు 
ఆకుల కొస ముళ్ళను చూడు 
ఈత చాపలు విసినకర్రలు 
పల్లెవాసుల నైపుణ్యమండోయ్!

ఈత కల్లు గీస్తారు సుత 
తాటి చెట్టు తమ్ముడు ఈత 
ఆకుపచ్చ మెత్తదనం 
ఈతాకుల సౌందర్యం !

నల్లని చిట్టీత పళ్ళు 
పల్లె నుండి అమ్మే వాళ్ళు 
తీపి దనం ఎక్కువండోయ్ 
చిట్టి తోటి కొలిచే వాళ్ళు!

ముల్లు తోటి జాగ్రత్తరోయ్ 
మనుషుల మాట ఈతముల్లు 
గుచ్చుకుంటే బాధిస్తుంది 
దూరంగా ఉంటే మేలు !