సృజన:- కె.ప్రతాప్ రెడ్డి (ప్రతాప్ కౌటిళ్యా)
నిద్ర లేకపోవడం
శ్రమదానం చేయకపోవడం దరిద్రం!?

దేన్నీ సృష్టించ లేము
కానీ సృజీంప చేయోచ్చు!?

దేన్ని నమ్మ లేకపోవచ్చు కానీ
బ్రమలు లేకుండా ఉండొచ్చు!

అమాయకత్వం లో ఉన్నంత మాత్రాన అది మాయ కాదు!?

ఊహ నిజమైతేనే అది కొత్తది కాదు
పాతది ఎప్పుడూ కొత్తది కాదు!!

వజ్రాలు తయారుచేయబడ లేదు
సృష్టించబడ్డాయి!?

మనుషులు మారితే నే కాదు
కాలం మారితేనే కలలు కూడా మారుతాయి!?

పదార్థమంతా ఒకటి కానట్లు శక్తి కూడా ఒకటి కాదు!!
వస్తువుల్ని సృష్టించినట్లు మనుషుల్ని సృష్టించలేం!?
ఒక క్రమంలో ఒక ప్రమాణం లో పరిణామంలో అవి పుడతాయి!?

సృష్టి కార్యంలో పాపపుణ్యాలు ఉండవు
మనుగడ కోసం ఎత్తుగడలు తప్ప!?

మానవుడా నీవు ఎవడవూ?
నీ సమాధానం పదార్థంలో లేదు జీవం లో ఉంది. ముందుకు సాగిపో!?

అవకాశమే అద్భుతం అది భూతమని భయపడితే గతం తప్ప భవిష్యత్తు లేదు!?

K.pratapreddy(pratapkoutilya)
8309529273