పుస్తకం (బాలగేయం):-- పెందోట వెంకటేశ్వర్లు- సిద్దిపేట్
బొమ్మలు అక్షరాల స్నేహం 
కథలు పాటల ఆనందం 
పద్యాలు వ్యాసాల విజ్ఞానం 
కలిసియున్నదే పుస్తకం

 హస్తభూషణం గా నిలిచిన 
సెల్పు , ర్యాకులందు నిండిన
 టేబుల్ పైన బ్యాగ్ నందున 
పుస్తకాలే గెలుపు పునాదులు

 అమ్మా నాన్న గురువుకన్నా 
స్నేహితులు ఆప్తుల కన్నా
 చిన్న పుస్తకంబే మిన్న
 తెస్తుంది కీర్తి కిరీటం