జయ జయ సేవా ‌భాయా,:- కైతిక కవి మిత్ర రాథోడ్ శ్రావణ్ ‌‌ ఉపన్యాసకులు MA,B,Ed,UGC NET (Ph.D)ముత్యాల హారం రూపకర్త,పూర్వ అధ్యక్షులు ఉట్నూర్ సాహితీ వేదిక ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా ,9491467715.


అనంతపూర్ జిల్లా
బళ్ళారిలో జన్మించి
బంజారజాతి కోసం
జ్ఞానజ్యోతి వెలిగించి
జయ జయ ! సేవాభాయా
జగదాంబ భక్తమయా ‌‌  (1)

నిజమైన దేవుడు
గోమాత రక్షకుడు
ధరమణిమాతా తనయుడు
సమాజ సేవకుడు
జయ జయ ! సేవాభాయా
కూర్పూర హరతి దర్శనమయా  (2)

జాతి ఐక్యత కోసం
సంస్కృతి రక్షణ కోసం
జీవన మనుగడ కోసం
స్థిర నివాసం కోసం
జయ జయ ! సేవాభాయా
ఆస్తిత్వ నిర్మాణమయా ‌ (3)

నరులను నారి చేసి
రాళ్ళతో డప్పు చేసి
మట్టి నైవేద్యం చేసి
నిర్జీవిని జీవి జేసి
జయ జయ ! సేవాభాయా
మీ మహిమ శ్రేష్టమయా ‌ (4)

అహింసా పూజారి
జ్ఞాన బ్రహ్మచారి
మానవసేవయే దారి
గోర్ జనుల హితకారి
జయ జయ ! సేవాభాయా
జయ శుభ మంగళదాయా  (5)

నిర్గుణ నిరంకారి
బాల బ్రహ్మచారి
జగదాంబ పూజారి
జీవితమే సంచారి
జయ జయ ! సేవాభాయా
దివ్య జ్యోతి ప్రచోదయా  (6)

ప్రసిద్ధ సాధువు
బంజారాల గురువు
జీవకోటికి హితవు
ధర్మణి పుత్రుడవు
జయ జయ ! సేవాభాయా
దేవుని స్వరూపాయా  ‌(7)

గొప్ప ఆధ్యాత్మిక భక్తి
పౌరఘడ్ లో మీ కీర్తి
మీలొ ఆదిమాయ శక్తి
బంజారాలకు స్ఫూర్తి
జయ జయ ! సేవాభాయా
పుష్పాక్షతాన్ సమర్పమయా (8)

ఫౌర పీఠాధిపతి
సౌందర్య తేజోకృతి
బంజారాల అధిపతి
నిన్ను కొలుచు జగతి 
జయ జయ ! సేవాభాయా
బాపు శక్తి స్వరూపాయా  (9)

మీజ్ఞానం అమృతము
మీప్రవచనాలు మధురము
మీకృపా కటాక్షము
మీపాద పూజ చేతుము
జయ జయ ! సేవాభాయా
భోగ్ బండారో సమర్పమయా  (10)

సమస్త జగదాయ
గోర్ జనులు పై మీ దయ
సేవా యోగి రాజాయ 
చూపించు కరుణామయా
జయ జయ ! సేవాభాయా
నమస్తుభ్యం సేవాభాయా ‌(11)

రామావత్ గోత్రంలో
సేవాలాల్‌ జన్మించి
ఉమ్రి పౌరాలలో
జాతరలను తెలిపించి 
జయ జయ ! ‌సేవాభాయా
ధర్మణి మాత తనయా ‌(12)

వాషిం జిల్లాలో
బంజారాల కాశీ
ధర్మ గురు భుక్తులను
ఒడిలో చేరదీసి
జయ జయ ! సేవాభాయా
ఫౌరాఘడ్ తీర్థమయా  ‌(13)

సేవాలాల్ బోధనాలు
కరుణ,దాన ధర్మాలు
జీవితమంతా సేవలు
లేదు మంత్ర తంత్రాలు
జయ జయ ! సేవాభాయా
భాయా‌ ఆనంత రూపమయా (14)
 
అఖండ సిధ్ధజ్ఞాన
సేవాలాలుని శక్తి
దివ్య దృష్టితోనే
జగదాంబదేవి భక్తి
జయ జయ ! సేవాభాయా
ఊహించని పరిణామమయా (15)

సంపన్న కుటుంబంలో
పుట్టిన సేవాభాయా
హాపా, బద్దు, పురా
ధర్మణిమాత తనయా
జయ జయ ! సేవాభాయా
గోర్ కోరులపై మీదయా (16)

అవతార పురుషుడు
ధర్మం ప్రచారకుడు
నిత్య సత్య బోధకుడు
ఆరాధ్యమైన దేవుడు
జయ జయ ! సేవాభాయా
దీపధుపం సమర్పమయా (17)

సేవాలాల్ మహారాజ్
తత్త్వోపదేశకునిగా
గో సేవాను చేసి
పశువుల కాపరిగా
జయ జయ ‌! సేవాభాయా
జయ లోకనాథాయా  (18)

బంజారా సమాజాన్ని
జన‌జాగృతం చెసి
సంస్కృతి రక్షణకై
జ్ఞాన, యజ్ఞం చేసి
జయ జయ ! సేవాభాయా
చుపించే కరుణ‌ మాయా ‌(19)

సేవా ప్రవచనాలు
లేని కులమత భేదాలు
ఆధ్యాత్మిక చింతనాలు
సృష్టించే అద్భుతాలు
జయ జయ ! సేవాభాయా
దేవుని స్వరూపమయా ‌(20)

ప్రవిత్రమైన గోవులను
అడవుల్లో మేపుకొని
సంచార జీవనంలో
సమాజాన్ని కలుపుకొని
జయ జయ ! సేవాభాయా
భవిష్యవాణితో జాగృతమయా (21)

తండా తండాలో
మీ గుడి గోపురాలు
భక్తి శ్రద్ధలతో
మీ భక్తుల పూజలు
జయ జయ ! సేవాభాయా
ప్రతిఊరిలో మీ మందిరమయా (22)
 
అహింసా పాపము
మత్తు మందు శాపము
విడిపించేను మద్యము
బణజారల సన్మార్గము
జయ జయ ! సేవాభాయా
సూజ్ఞన బుద్ధి ప్రచోదయా  (23)

భక్తి ముక్తి ప్రదాయ
సిద్ధి బుద్ధి ప్రదాయ
సర్వ సిద్ధి ప్రదాయ
పాప హరేదేవాయ
జయ జయ ! సేవాభాయా
ప్రసన్నా వరదాయా ‌ (24)

సమాజ కల్యాణం కై
సమాజ చైతన్యం కై
పరహితము కొరకై
గోర్ స్వాభిమానం కై
జయ జయ ! సేవాభాయా
సర్వ విఘ్నాపశాంతమయా (25)

గోర్ కులంలో పుట్టిన
గొప్ప ప్రబోధకుడు
జనులను ఆకట్టుకున్న
గొప్ప ఆధ్యాత్మికుడు
జయ జయ ! సేవాభాయా
జయశుభ మంగళదాయా (26)