కరోనా కష్టాలలో మనోధైర్యo:-అవ్వారి ఉమాభార్గవి.సూర్యాపేట. -సూర్యాపేట (తెలంగాణ)
ప్రక్రియ పేరు:  "సున్నితం"
రూపకర్త:శ్రీమతి నెల్లుట్ల సునీత గారు
**************************
కనిపించని సూక్ష్మజీవి కరోనా
మనుషులందరిని చేస్తుంది హైరానా
ప్రాణాలు హరిస్తుంది అడుగడుగునా
చూడచక్కని తెలుగు సున్నితంబు(6)

మాస్కె ఆయుధమై రక్షించు
శానిటైజర్తో క్రిమిని సంహరించు
ఎక్కడికెళ్లినా దూరాన్ని పాటించు
చూడచక్కని తెలుగు సున్నితంబు(7)

పౌష్టికాహారమే ఇచ్చును రక్ష
లేదంటే తప్పదు శిక్ష
అందరికి నేడిది పరీక్ష
చూడచక్కని తెలుగు సున్నితంబు(8)

మనం ధైర్యంతో అడుగేద్దాం
రోగంతో పోరాడుదాం
రోగికి అండగా నిలబడదాం
చూడచక్కని తెలుగు సున్నితంబు(9)

భయంతోనే సగప్రాణం పోవు
గుండెనిబ్బరంతో మెలిగితే నీవు
కరోనవైరస్ ని తిప్పికొడతావు
చూడచక్కని తెలుగు సున్నితంబు (10)