ప్రక్రియ:: సున్నితం: రూపకర్త:: శ్రీమతి నెల్లుట్ల సునీత: : కరోనా కష్టాల్లో మనోధైర్యం : - S. రత్నలక్ష్మి,అసిస్టెంట్ ఇంజనీర్ నంద్యాల, కర్నూలు జిల్లా--సెల్:: 8331930635

 166
బయటికెళ్తే మాస్కును ధరించు
ఆరడుగుల దూరాన్ని పాటించు
శానిటైజర్తో చేతులను శుభ్రపరుచు
చూడచక్కని తెలుగు సున్నితంబు
 
167
కాస్త నలతకు కంగారుపడకు
కరోనా సోకిందని భయపడకు
దిగులుతో భయంతో ధైర్యాన్నివీడకు
చూడచక్కని తెలుగు సున్నితంబు

168
బంధువర్గం ఇవ్వాలి భరోసా
మిత్రులు కలిగించాలి కులాసా
నిరాశను తరిమికొట్టేలా ధిలాసా
చూడచక్కని తెలుగు సున్నితంబు

169
సత్వరమే చికిత్సను తీసుకొని
తప్పక మందులు వేసుకొని
ఆరోగ్యాన్ని పొందాలి శ్రీఘ్రగతిని
చూడచక్కని తెలుగు సున్నితంబు

170
మనోధైర్యమే ఔషధమని గ్రహించు
కరోనాను విజయవంతంగా జయించు
ఆనందంగా జీవితాన్ని కొనసాగించు
చూడచక్కని తెలుగు సున్నితంబు