*కరోనా వైరస్ & మానవజాతి* :-పి. చైతన్య భారతి-(ప్రభుత్వ ఉపాధ్యాయురాలు) ZPHS. నేరేళ్లపల్లి బాలానగర్ మండలంమహబూబ్ నగర్ జిల్లా 7013264464

 
మితృలారా ! ధైర్యంగా ఉండండి!
         *********************
    *పూర్వం ఒక ప్రాణాంతక వైరస్ భూమి మీదకు ప్రవేశిస్తున్న సమయంలో, ఒక మహా ఋషి ఆ వైరస్ ను ,” భూమి మీదికి ఎందుకు ప్రవేశిస్తున్నావు ?” అని అడిగాడట.
“ ప్రణామములు మహర్షీ ! ఒక వంద మందిని చంపి పోతాను”, అని ఆ వైరస్ సమాధానం చెప్పింది. 
“అయితే సరే”, అన్నాడు మహర్షి.
ఆ వైరస్ వలన ఒక కోటి మంది మానవులు చచ్చిపోయారు.
ఆ వైరస్ భూమినుండి వెళ్ళిపోతుండగా, మహా ఋషి కోపంతో ఆ వైరస్ ను శపించబోతూ,” నువ్వు చెప్పిందేమిటి ? చేసిందేమిటి ?”, అని అడిగాడు. 
వైరస్ భయంతో కంపించిపోతూ” క్షమించండి ఋషివర్యా ! నేను చంపింది వందమంది మనుషులనే, కాని భయాందోళనలతో కోటిమందికి పైగా చనిపోయారు”, అని చెప్పింది. 
మహా ఋషి శాంతించాడట ! 
ఇవాళ భూమి మీద అలాంటి పరిస్థితే ఉంది. 
                    
— ప్రకృతిని (నియమాలను), జీవితంనూ, భూమి(స్వచ్ఛతను) అతిక్రమించకండి. ఈ వైరసులు ,అప్పుడూ ఇప్పుడూ, జీవించే ఉంటాయి.  దేహంను సమతులనంలో ఉంచేందుకు ఈ వైరసులు మేలు చేసేవిగాను, హాని తలపెట్టేవిగాను( ప్రకృతిని అతిక్రమిస్తే) పరివర్తన చెందుతాయి.
(మీరు జాగ్రత్తగా గమనిస్తే - ప్రకృతికి దగ్గరగా ఉండే : రైతులలో, పసిపిల్లల్లో, చెమటోడ్చి పనిచేసే వారిలో కేవలం 3% లోపు వారికి మాత్రమే *కరోనా వైరస్* తాకిడి ఉంది. వారిలో 99.99 % recover అవుతున్నారని లెక్కలు చెప్తున్నాయి.)
— (జీవితంలో) మానసికత, ఆధ్యాత్మికత, మరి భౌతికతల మధ్య విభజన అంటూ ఏమీ ఉండదు. (ఈ మూడు ఒకటే). (మౌలికంగా )ప్రతీ వ్యక్తీ మంచివాడే; వ్యక్తిగతంగా ఈ విశ్వశక్తిలో ఒక భాగం ! 
ప్రతీ వ్యక్తీ తన గుణగణాలను, సామర్థ్యాలను ప్రకటం చేస్తూనే వుంటాడు. జీవితమంటేనే శక్తి యుక్తులను ప్రకటం చేయడం ! (ఇదే జీవితం యొక్క పరమార్థం కూడ).
— శిశువులు స్వాభావికంగా ఈ పరిసరాలు, ఇతర జీవజాలంనకు భయపడి జన్మించడం జరగదు. పైగా ఎంతో తేజస్సుతో, ఉల్లాసం + సమృద్ధితో , సంక్షేమంతో ఆనందంగా మునిగి ఉంటారు; చిన్న పిల్లలను(సహజంగా ఉంటారు కాబట్టి ) వైరసులు దడిపించలేవు. 
( కరోనా వైరస్ attack అవుతుందేమో అని భయపడితే attack అవుతుంది; నాకు attack అవదు అని బలంగా విశ్వసిస్తే అవదు.
   అందుకే మనో ధైర్యమే మందు.