*1.దత్తపదులు:*:-బెజుగాంశ్రీజ-గుర్రాలగొంది:జిల్లా: సిద్దిపేట-చరవాణి:9391097371.

 తే.గీ.
 *ఆటు* *పోటు* లేర్పడగాను *పాటు* పడుతు
కాలమునకణుగుణముగ కష్టపడుతు
*చాటు* గాసమస్యలునేమొ చక్కదిద్ది
ధైర్యమువిడవకబతుకు ధరణియందు.
*2.దత్తపది*
 తే.గీ.
*అతి* గనాశలు పెరుగగ హానికలుగు
ప్ర *గతి* దారులు వెతకగా పనులుజరుగు
మంద *మతి* యైన*నభివృద్ధి మందగించు 
*నుతి* ని 
చేయగ సాగునా సతము పనులు.
పాఠశాలలు పునః ప్రారంభం
 సీసం:
పాఠశాలలునన్ని ప్రారంభమవ్వగ
మంచిదుస్తువులనె యెంచినివ్వ
ప్రతిరోజు ధరియించి లక్షణంబుగమేము
బడికినేగెదమంత భద్రముగను
గంటలుమ్రోగంగ కలసియునొకచోట
ప్రార్థన జేతుమే పరవశించి
క్రమశిక్షణ కలిగి క్లాసులోనికి వెళ్ళి  
మనసుబెట్టిజదువ మార్గమౌను
*తేటగీతి*
గురువుజెప్పినపాఠాలు గుర్తుగాను
సమయపాలనకేతెంచి సరిగవినిన
మనకు సాటిరారెవ్వరు ననవరతము
విద్యనార్జించివెడలాలి వినయముగను.