*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౧౧ - 11)

 శార్దూలము :
*వీడెంబబ్బిన యప్పడున్; దమనుతుల్ | విన్నప్పుడుం; బొట్టలో*
*గూడున్నప్పుడు; శ్రీవిలాసములు పై | కొన్నప్పుడుం; గాయకుల్*
*పాడంగా వినునప్పుడున్; చెలగుదం | భప్రాయు నిశ్రాణనన్*
*క్రీడాసక్తుల నేమి చెప్పవలెనో  | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
మా మనుషులకు, తమకు పెద్దరికం కట్టబెట్టి తాంబూలము ఇచ్చినప్పుడు, కవులు, గాయకుల నోటిద్వారా మా పొగడ్తలు విన్నప్పుడు, కడుపు నిండా భోజనము పెట్టి, పరిచర్యలు చేసినప్పుడు, ఈ శరీరము ద్వారా లభించే భోగములు అనుభవించునప్పుడు, అలవి మీరిన దానములు చేయు వారి గురించి ఏమని చెప్పగలము....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*నీ మాయను గుర్తించ లేక, ఈ శరీరము వల్ల కలిగే భోగభాగ్యాల లో తేలియాడుతున్నాము, మేము. మాకు కన్నూ మిన్నూ కనపడటము లేదు.  మీ బిడ్డలమైన మమ్మల్ని ఈ నరక ప్రాయమైన మార్గం నుండి నీ దారిలోకి తిప్పుకో, త్రపురాంతకా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss