*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౧౪ - 14)

 శార్దూలము :
*నిన్నే రూపముగా భజింతు మదిలో | నీ రూపమోకాలో స్త్రీ*
*చన్నో కుంచమో, మేకపంటియొ యీ | సందేహముల్మాన్పి నా* *కన్నార న్భవదీయమూర్తి సగుణా | కారంబుగ జూపవే*
*చిన్నీరేజ విహార మత్తమధుపా | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
నా మనస్సు అనే చెరువులోని నీటిలో పుట్టిన పద్మములోని తేనెను తిమ్మెదవైన ఈశ్వరుడివి నువ్వు.  ఒకసారి స్త్రీ చన్ను రూపంలో, వ్యాపారుడు కొలిచే కుంచము లాగా, ఇంకొక సారి మేక పెంటికలాగా కనిపిస్తావు. అసలు నీ నిజమైన రూపం ఎలా వుంటుందో ఒక్కసారి చూపించవా, పర్వతపుత్రి పతీ.....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*అర్జునుడి మోకాలులో కృష్ణభగవానుడు నిన్ను దర్శించి, నీ పూజ చేస్తే, ఆ పూజకి మెచ్చి అర్జునుడికి పాశుపతం ఇచ్చావుకదా, పశుపతీ.  కార్తీక మాసములో శివరాత్రి నాడు స్త్రీ లోలుడై వుండిన ఒక మానవుడు ఆ సమయంలో ఆ తరుణి స్తనం మీద  మీ దివ్యమైన దర్శనం చేసుకుని నీ పూజ చేసినందుకు ఆ భక్తునికి నీ సాయుజ్యమే ఇచ్చి, "ఆచంటేశ్వరుడు" అయ్యావు.  వ్యాపారి ఒకడు తను ధాన్యం కొలిచే కుంచెంలో నీ మూర్తి చూచి, నీ పూజ చేసాడని అతనికి మోక్షాన్నిచ్చి, "కుంచేశ్వరుడు" అయ్యావు.  గొల్ల పిల్లవాడు మేకపెంటికలు ఏరుతూ నీ నామము జపించాడని, అతనికి కైవల్యమే ఇచ్చావు. అసలు నువ్వు ఎవరు స్వామీ? నువ్వ.  ఎలా వుంటావు, స్వామీ? కపర్ధివా, వ్యుప్తకేశుడివా, సహస్రాక్షుడివా? ఎవరు దేవా? అసలు ఎవరూ కావా. ఏమిటీ రహస్యం.  నీ నిజరూపం చూపు, స్వామీ.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss