*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౧౬ - 16)

శార్దూలము:
*రాలన్ రువ్వగ చేతులాడవు, కుమా | రా! రమ్మురమ్మంచునే*
*చాలన్ చంపగ, నేత్రముల్దివియగా | శక్తుండనేగాను, నా*
*శీలంబేమని చెప్పనున్నదిక నీ | చిత్తంబు, నా భాగ్యమో*
*శ్రీ లక్ష్మీపతి సేవితాంఘ్రియుగళా | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
లక్ష్మీ దేవి భర్త అయిన విష్ణుమూర్తి చేత పూజింపబడిన పాదములు కలవాడివి నువ్వు.  నేనేమో, నీ మీదకు రాళ్ళు విసరడానికి శక్తి లేని వాడను నా బిడ్డను నీ కొరకు చంపుకోలేని వాడను, ఇంక నీవు చూడటానికి వీలుగా నా కళ్ళు  నీకు ఇవ్వలేను. నేను నీకోసం ఈ విధంగా చేయగలను అని చెప్పలేనిది నా ప్రవర్తన.  నీ మనస్సులో నా మీద దయ కలగడఢమే గొప్ప విషయం, కదా పార్వతీ పతీ .....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*భక్త శిరియాళుడు నీమీద అనన్య సామాన్యమైన భక్తితో, తన కుమారుని నోకోసం అర్పిస్తాడు.  ఇక తిన్నడు, కోయ జాతి వాడైనా, నీ మీద వున్న నమ్మకంతో, తను చూచే ప్రపంచం నీవు చూడాలి అని,తన కళ్ళను పరికి నీకు అమరుస్తాడు. ఈ క్రమంలో, తన లాలుతో నిన్ను ముట్టుకుంటాడు కూడా. కానీ, వారి భక్తి, శ్రద్ధ లకు మెచ్చి వారికి మోక్షం ఇవ్చావు,త్రికూటేశ్వరా! మరి నాకు, నీ పరీక్షలకు నిలబడ గలిగే శక్తి లేదు కదా, పన్నగభూషణా! నీ కరుణ, దయ నా మీద వుంచి, నన్ను నీ దగ్గరకు రప్పించుకో, చంద్రమౌళీ! పరమాత్ముడైన లక్ష్మీ పతి నీ పాదాలు సేవించితే, సాన్య మానిషిని, నేనగా ఎంత, వ్యుప్తకేశా! నీవు, నీవే మాకు దిక్కు, దిక్పతీ*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss