శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౧౭ - 17)

 శార్దూలము:
*రాజుల్మత్తులు, వారిసేవ ‌నరక | ప్రాయంబు, వారిచ్చు నం*
*భోజాక్షి చతురంతయానతురగీ | భూషాదు లాత్మవ్యధా*
*బీజంబుల్, తదపేక్ష చాలు, పరితృ | ప్తి పొందితిన్, జ్ఞాన ల*
*క్ష్మీజాగ్రత్పరిణామ మిమ్ము, దయతో | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
రాజ్యాలను ఏలే రాజులు గర్వముతో నడుపుకుంటూ వుంటారు.  అటువంటి రాజులను సేవించడం అనే విషయం మాకు ఆత్మహత్యా సదృశ్యం కదా.  రాజులచే ఇవ్వబడిన స్త్రీలు, పల్లకీమోతలు, గుర్రాలు, బహుమతులు ఇవి అన్నీ కూడా  మాకు మనసుకు ఇబ్బంది కలిగించే విషయాలు.  ఈ విషయాలు అన్నిటిమీదా నేను తృప్తి చెందాను. నాకు వీటి అవసరం ఏమాత్రమూ లేదు.  మా మీద నీకు వున్న దయ కరుణ లతో మాకు జ్ఞానము ఇచ్చి మమ్మల్ని కాపాడు, కాపాలికా! .....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*నీ భక్తులు ఎవరూ కూడా రాచరికం నుడీ కలిగే ప్రాపంచిక, ఐహిక సుఖాలు సంపాదించుకోడానికి ఇష్ట పడరు. ఎందుకంటే, రాజ సేవ ఆత్మహత్యా సదృశంగా వారు గ్రహించారు. నీ రూపం కంటే అందమైన రూపం వేరొకటి ఈ భూమి మీద వుందా.  నీ పల్లకీ మోయడం కంటే సుఖం ఇంకెక్కడ పరమేశా!  నీ భస్మం గ్రహించడం, రుద్రాక్ష ధరించడం కంటే, సంపదలు ఎక్కడ వున్నాయి, ఆశ్రిత రక్షకా!  ఈ విషయాలు అన్నీ, నీవు ఇచ్చే జ్ఞానం తోనే నేను తెలుసుకున్నాను.  కావున, మా గమనాన్ని నీవైపు తిప్పుకునే తెలివి నీవే ఇవ్వాలి,అంబాపతీ!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss