శార్దూలము:
*నిన్నున్నమ్మినరీతి నమ్మ నొరులన్, | నీకన్న నాకెన్న లే*
*రన్నల్దమ్ములు, తల్లితండ్రులు గురుం | డాపత్సహాయుండు, నా*
*యన్నా! యెన్నడు నన్ను సంస్కృతి విషా | దాంబోధి దాటించి య*
*చ్ఛిన్నానంద సుఖాబ్ధి దేల్చెదోకదే | శ్రీకాళహస్తీశ్వరా!*
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
నిన్ను మాత్రమే నమగమాను. నిన్ను నమ్మినట్లుగా ఇంకొకరిని నమ్మలేదు, నమ్మను కూడా. అమ్మ, నాన్న, అక్క, చెల్లి తమ్ముడు, స్నేహితుడు, చుట్టములు, ఆపదలో సహాయపడే వారూ, ఎవరూ నాకు ఎక్కువ కాదు. ఈ సంసార బంధాలు తీసివేసి,ఒక్క నిమిషం కూడా నానుండి దూరంకాని ఆనందంలో ఎప్పుడు మునక వేయిస్తావు,స్వామీ! .....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*పరాత్పరా, పరేశా! నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేదని నమ్మికాగా వున్నాను. నీ మాయ చేత కుదర్చబడిన ఈ సాంసారిక బంధనాలు ఏవీ శాశ్వతమూ కావు, శాశ్వతమైన ఆనందాన్ని ఈయవు అని నీ విచ్చిన తెలివితోనే తెలుసుకుని, నిన్ను నమ్మి వున్నాను. ఈ భవబంధాలు తొలగించి, నిత్యము, సత్యము, నిరామయమూ, నిర్వికల్పము అయిన నీ నామ జపంతో ఒనగూడే సుఖాంబుధిలో నన్ను ఓలలాడించి, నీ సన్నిధి ప్రసాదించు, చిదంబరేశా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి