తాతయ్య కథలు-28. ;ఎన్నవెళ్లి రాజమౌళి

 కిలో చక్కెర, కిలో కందిపప్పు, అర కిలో పెసరపప్పు, జెమినీ చాయ పత్తా పావు కిలో తీసుకు రమ్మంటి కదరా. నేను నాలుగు వస్తువులు తెమ్మంటే... రెండు వస్తువులే తెచ్చావేమిరా. అని అమ్మ అనగానే...
నాకు జ్ఞాపకం లేదు అమ్మ. అని కొడుకు అన్నాడు. ఏమి జ్ఞాపకం ఉంటుంది రా. చూసి రమ్మంటే కాల్చి రావాలి...
ఎప్పుడూ ఇలాగే అంటూ ఉంటావు. చూసి రమ్మంటే కాల్చి రావడం అంటే ఏమిటి అమ్మ. అని కొడుకు అడగ గా..
సీతమ్మ జాడ తెలుసుకోను వెళ్లిన హనుమంతుడు-సీతమ్మ జాడ తెలుసుకుని... అమ్మ ఆకలి అవుతుంది అన్నాడట.
ఆమె అశోకవనంలో ఒక పండు తినమంటే... చెట్లు విరిచి-కొమ్మలు విరిచే సరికి...
రావణాసురుడి వద్దకు ఆంజనేయుని పట్టుకు పోతే... తోక కోతులకు అందం.
తోకను కాల పెట్టమన్నాడు రావణుడు.తోక ను కాల్చగా కాలే తోకతోనే లంకాపురి పట్టణమంతా కాల పెట్టాడట. అది సూచి రమ్మంటే కాల్చి రావడం.. అని చెప్పింది అమ్మ.