మత్తేభము:
*గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ | కళ్యాణనామంబు ప్ర*
*త్యహమున్ బేర్కొను నుత్తమోత్తముల బా | ధంబెట్టగా నోపునే*
*దహనుంగప్పజాలునే శలభసం | తానంబు? నీ సేవచే*
*సి హతక్లేశులు గారు గాక మనుజుల్ | శ్రీకాళహస్తీశ్వరా!*
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
అన్ని కోరికలనూ, కష్టాలనూ దీర్చే నీ పేరు పట్టుకుని వున్న వారిని, గ్రహాల కదలిక వల్ల గానీ చెడు శకునాల వల్ల గాని వచ్చే బాధలు ఏమీ చేయలేవు, కదా శివా! అగ్ని దేవుని అమితమైన ప్రభావాన్ని మిడతల దండు ఆపలేదు కదా. నీ పేరు స్మరించి నందువల్ల వచ్చే శక్తి తో ఈ మనుషులు తమకు కలిగిన బాధలనుండి ముక్త పొందుతారు కదా, కైలావాసా!....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*నిరతమూ నీ సేవలో తరిస్తూ, నీ నామ స్మరణ చేస్తూ వుండే మనుజలకు వారికి కలిగే కష్టాల స్పృహ వుండదు కాదా,కార్తకేయ జనకా! మృత్యవునే అపమృత్యవు చేయగల వాడవు నీవు. నీ మాయ వల్ల, ఆ మృత్యు భీతిలో బ్రతికే వాళ్ళము మేము. కానీ,నీ దయ, కరుణ వున్న మమ్మల్ని ఆ సూర్యని ప్రధమ పుత్రుడు కూడా ఏమీ చేయలేడని, మార్కండేయుని ద్వారా చెప్పావు కదా, మృత్యుంజయా! ఇన్ని మాటలెందుకు, నిన్ను నమ్మి వున్న వారికి ఏ భయమూ వుండదు, లేదు, రాదు. ఇది నిక్కము. ఇదే నిక్కము.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి