మత్తేభము:
*అడుగంబోనిక నన్య మార్గరతులం | ప్రాణావనోత్సాహినై*
*యడుగంబోయిన బోదు నీదు పదప | ద్మారాధక శ్రేణియు*
*న్నెడకు నిన్ను భజింపగాగనియు నా | కేలాపరాపేక్ష కో*
*రెడిదిం కేమి భవత్ప్రసాదమె తగున్ | శ్రీకాళహస్తీశ్వరా!*
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
నాకు ప్రాణము నిలబడడానికి అవసరమైన ధనము, వస్తువులు, సంపదల కోసం, నీ భక్తులు కాని వారి దగ్గరకు వెళ్ళి అడుగను కాక అడుగను. ఒక వేళ అలా వేళ్ళి అడగాల్సిన పరిస్థితి వస్తే, నీ పదాలు సేవించే నీ భక్తులు ఎంతో మంది వున్నారు కదా, వారి దగ్గరకు వెళ్ళి అడుగుతాను. అయినా, నీ భక్తుడిగా వున్న నాకు బాధలూ, కష్టాలు రావడం ఏమిటి, క్షీరారామలింగా! రానే రావు కదా!....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*నీ భక్తుడు నందనారు, నీ దగ్గరకు వద్ఆము అనుకుంటే, పంట నూర్పడి పూర్తి చేసి నీ దర్శనానికి వెళ్ళమంటే, పని చేస్తూనే నీ ధ్యానంలో వుండి,అలసి పోయి పడుకుంటే, ఆ పంట నూర్పిడి నీవే పూర్తి చేసావు కదా, చిదంబరా! ఇంతా చేసి పరుగు పరుగున గుడి దగ్గరకు వస్తే, కులం గుర్తు చేసి లోపలకు రానీయలేదు కదా అక్కడి పూజారులు. నువ్వు గుడి బయటకు వెళ్ళి నందునికి సాక్షాత్కరించావు కదా, ఆశ్రిత వత్సలా! మరి నీభక్తలు ఇలా అడగిందే తడవుగా వచ్చి ఇచ్చే కామధేనువు నీవు వుండగా, నేను ఇంకొకరిని ఎందుకు ఆశ్రయిస్తాను. నాకు కష్టాలు ఎందుకు కలుగుతాయి. "హర హర మహాదేవ! హర హర మహాదేవ! శంభోశంకర! సాంబసదాశివ!"*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి