తాతయ్య కథలు-30.:- ఎన్నవెళ్లి రాజమౌళి

  చెప్పింది చేయక యక్ష ప్రశ్నలు వేస్తావ్ ఏంది? అన్నది అమ్మ కూతురుతో...
నేను ఏది మాట్లాడినా యక్ష ప్రశ్నలు అంటూ ఉంటావు. అసలు యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి అమ్మా అన్నది కూతురు.
ఒక సందర్భంలో ధర్మరాజు తమ్ముళ్లు విగత జీవులు అయినప్పుడు, యక్షుడు ప్రత్యక్షమై తను వేసే ప్రశ్నలకు జవాబు చెబితే తిరిగి మీ తమ్ముల పునర్ జీవుల చేస్తానంటాడు.
యక్షుడు అడిగిన ప్రశ్నలకు ధర్మరాజు సమాధానం చెప్పాడా అమ్మ.
అదిగో నన్ను చెప్పని స్తావా... లేదా!
చెప్పమ్మా... చెప్పు. ఇప్పుడే నా నోటికి తాళం వేస్తే గా... అని  వేలు మూతిపై నిలువుగా పెట్టుకుంది కూతురు.
కూతురు నటనకు నవ్విన అమ్మ-
కఠినమైన యక్షుని ప్రశ్నలకు జవాబులు చెప్పడంతో... తన తమ్ముల పునర్జీవుల చేశాడు యక్షుడు. అని అమ్మ కూతురుకు  చెప్పింది.
.