తాతయ్య కథలు-31. -- ఎన్నవెళ్లి రాజమౌళి

 ఒక్కొక్కసారి కట్టే, కొట్టే, తెచ్చేలా విషయాన్ని చెప్ప రావాలి. అని నాన్న అనడంతో-
కట్టే, కొట్టే, తెచ్చే అంటే ఏమిటి నాన్న, అన్నాడు కొడుకు.
కోతులు వారధి కట్టి, రావణాసురుని తల కొట్టి, సీతమ్మను తెచ్చారు అన్నమాట. ఈ మూడు ముక్కల లో రామాయణం చెప్పారు.
అంత పెద్ద రామాయణం ఇలా చెప్పారా నాన్న అని కొడుకు అనడంతో...
అవును. విషయాన్ని విస్తారంగా చెప్పడం ఎంత నైపుణ్యమో.. అదే విషయాన్ని సంక్షిప్తంగా చెప్పడం అంతే ముఖ్యం అన్నాడు నాన్న.
మీరు చెప్పినట్టే... మాకు పరీక్షలలో కూడా  విషయాన్ని ఇచ్చి, సంక్షిప్తంగా రాయమని చెబుతారు నాన్న.
అవున్రా. అలా కూడా రాయ రావాలి అన్నాడు కొడుకుతో.