తాతయ్య కథలు-32. :- ఎన్నవెళ్లి రాజమౌళి

 హలో నేను చెట్టును. చెట్టు వా? నీకు మాట ఎలా వచ్చింది. నీ గొడ్డలి కాటుతో కలిగిన బాధతో... అన్నది చెట్టు.
అలాగా అన్నాడు రామయ్య
కాకపోతే... నేను చెప్పేది విను. నీకు కాయలు, పళ్ళు, ఆక్సిజన్ ఇస్తుంటే... మా చెట్లని నరుకుతారా అన్నది చెట్టు.
కట్టెలు కొట్టి అమ్ముకోవాలి కదా మరి! ఏదైనా పని చేసుకో... పండుగలు వచ్చాయంటే... ఇంటి గుమ్మానికి తోరణము అయ్యేది మా ఆకు లే కదా! ఇది కాక, కోతులతో ఊర్లలో ఇబ్బందులు అవుతున్నాయంటే కారణం-అరణ్యాలు అంతరించు డే కదా, అనేసరికి-గొడ్డలి కింద పడేసి. చెంపలేసుకుంటున్న అన్నాడు. నీ కట్టెలు కొట్టి అమ్మటా నికి బదులు ఏదైనా కూలి చేసుకుంటా అంటూ వెళ్లాడు రామయ్య.