తాతయ్య కథలు-33. :- ఎన్నవెళ్లి రాజమౌళి

 ఆవు  మేత మేస్త లేదురా... డాక్టర్ దగ్గరికి అవును తోలుకుని వెళ్దాం అన్న నాన్న ఎల్లయ్య తో-
సరే నాన్న ఇప్పుడే వస్తున్నాగా.. అంటూ కొడుకు ఇంట్లో నుండి వచ్చాడు.
ఆవును  పశువుల డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే... పరీక్ష చేసి ఆపరేషన్ చేయాలి. రేపు ఆవును అవును తోలుకొని రండి అని చెప్పడంతో...
మరునాడు ఆవును కోలుకొని పోగా ఆపరేషన్ చేసి కడుపు నుండి గంపెడు ప్లాస్టిక్ కవర్లు తీశారు.
ఇక మీరు ఆవును  తోలుకొని వెళ్ళవచ్చు అన్న డాక్టర్-ఆవు నుండి పాలు తీసుకుని అమ్ముకున్నాడు కానీ... గడ్డి వేయడం లేదు. అందుకే ఆవు ఊరు మీద తిరిగి ప్లాస్టిక్ కవర్లు తిన్నది.
గడ్డి వేస్తాం సార్ అన్న ఎల్లయ్య తో... ఏమి వేశారయ్య. గోవు ను మనవాళ్లు తల్లిలా చూసి  గోమాత అన్నారు. ఆ గోవుకు పల్లి పిండి.. ఉలవ పిండి పెట్టి పుష్టిగా పెంచుకోవాలి. కానీ, ఇలా ఊరు మీద వదుల్తారా.. అనేసరికి తండ్రి కొడుకులు తలలు దించుకున్నారు.